ఆసక్తి రేకెత్తిస్తున్న “వరుణ్ డాక్టర్” ట్రైలర్..!

Published on Sep 25, 2021 8:39 pm IST


తమిళ నటుడు శివ కార్తికేయన్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే శివ కార్తికేయన్‌ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘డాక్టర్‌’. శివ కార్తికేయన్ మరియు కేజే ఆర్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘వరుణ్‌ డాక్టర్‌’ పేరుతో ఈ సినిమా తెలుగులోనూ విడుదల కాబోతుంది .

అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. వరుసగా జరుగుతున్న అమ్మాయిల కిడ్నాప్‌లను ఓ డాక్టర్‌ ఎలా అడ్డుకున్నాడు? ఈ క్రమంలో ఆ డాక్టర్ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుని ఆ ముఠా పని పట్టాడు? అనేదే ఈ సినిమా కథాంశంగా అనిపిస్తుంది. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఇకపోతే ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :