శివ కార్తికేయన్ “డాన్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్?

Published on May 16, 2022 12:02 am IST

కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ తాజా చిత్రం డాన్ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌కి విక్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 10, 2022న లేదా ఆ తర్వాత ప్రదర్శించ బడుతుంది అని తెలుస్తోంది.

అయితే, మేకర్స్ లేదా OTT ప్లాట్‌ఫారమ్ నుండి అధికారిక ప్రకటన లేదు. క్లియర్ పిక్చర్ రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. లైకా ప్రొడక్షన్స్ మరియు శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ హిట్ మూవీలో ఎస్ జె సూర్య, సముద్రఖని మరియు ఇతరులు కూడా భాగం. అనిరుధ్ రవిచందర్ సౌండ్ ట్రాక్స్ చూసుకున్నారు.

సంబంధిత సమాచారం :