శివ కార్తికేయన్ – కమల్ హాసన్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్?

Published on May 20, 2022 8:00 am IST

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తన 21వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. యూనివర్సల్‌ యాక్టర్‌ కమల్‌హాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పై సోషల్ మీడియా లో మాత్రమే కాకుండా, ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ చిత్రానికి మావీరన్ అనే టైటిల్ ను అధికారికంగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటుడు, నిర్మాత మరియు పంపిణీదారుడు ఉదయనిధి స్టాలిన్ సినిమా టైటిల్‌ను వెల్లడించారు.

ఈ చిత్రంలో శివకార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :