శివ కార్తికేయన్ “ప్రిన్స్” డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి దిగ్గజం!

Published on Jun 22, 2022 2:00 am IST

జాతిరత్నాలు చిత్రం తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అనుదీప్. అనుదీప్ దర్శకత్వం లో శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. శివ కార్తికేయన్ యొక్క ప్రిన్స్ సినిమా మోస్ట్ ఎవైటెడ్ చిత్రాలలో ఒకటి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ దీపావళికి ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు.

ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ఇప్పుడు సమాచారం. సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ కామెడీ కేపర్‌తో శివ కార్తికేయన్ తెలుగు అరంగేట్రం చేస్తున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :