ఫస్ట్ లుక్ తో ఆకట్టుకుంటున్న శివ కార్తికేయన్ “ప్రిన్స్”

Published on Jun 9, 2022 6:50 pm IST


శివ కార్తికేయన్ తెలుగు అరంగేట్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ త్వరలో తెలుగు తెరకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది.

ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ప్రిన్స్ అనే టైటిల్ ను పెట్టారు. మరియు ఫస్ట్ లుక్‌లో శివ కార్తికేయన్‌ను సూపర్ కూల్ గా కనిపిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్క కథానాయిక గా నటిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్ మరియు శాంతి టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :