ఫైనల్ గా ఓటిటిలో వచ్చేసిన శివకార్తికేయన్ ‘ప్రిన్స్’

Published on Nov 25, 2022 2:00 am IST


శివ కార్తికేయన్ హీరోగా మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా తెరకెక్కిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ప్రిన్స్. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఇక ఇటీవల మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ప్రిన్స్ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ మూవీ ఓటిటి రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా ఫైనల్ గా నేడు కొద్దిసేపటి క్రితం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ ద్వారా ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. సత్యరాజ్ కీలక పాత్ర చేసిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించగా ప్రముఖ కెమెరా మ్యాన్ మనోజ్ పరమహంస డీవోపీ గా వర్క్ చేసారు. మరి థియేటర్స్ లో పర్వాలేదనిపించిన ఈ మూవీ ఓటిటి లో ఆడియన్స్ ని ఎంతమేర అలరిస్తుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :