అలాంటి ఇండియన్, నా స్నేహితుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు – ఎస్.జే.సూర్య

అలాంటి ఇండియన్, నా స్నేహితుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు – ఎస్.జే.సూర్య

Published on Jul 7, 2024 11:27 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉన్నప్పటికీ, మిగతా రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి సెలబ్రిటీలు ప్రశంసలు అందుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్.జే. సూర్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రేమతో దేశం కోసం ఎవరైనా మంచి చేస్తే, అతను ఇండియన్ అని అన్నారు. అయితే మీ అందరిలో ఇండియన్ ఉన్నారు. ఇంకో పాయింట్ షేర్ చేసుకోవాలని ఉంది అంటూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకు వచ్చారు. అలాంటి ఒక ఇండియన్, నా స్నేహితుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. ఈ ఒక్క మాటకి ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. పవన్ పై వచ్చిన ఆ మాటలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ సిఎం నా ఫ్రెండ్ అని గర్వంగా చెపుతాను. సగం ప్రూవ్ అయ్యింది, మిగతా సగం మీరే ప్రూవ్ చేయాలి అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు