వైరల్ వీడియో : పవన్ కళ్యాణ్ తో ‘ఖుషి’ మెమోరీస్ ని గుర్తు చేసుకున్న ఎస్ జె సూర్య

వైరల్ వీడియో : పవన్ కళ్యాణ్ తో ‘ఖుషి’ మెమోరీస్ ని గుర్తు చేసుకున్న ఎస్ జె సూర్య

Published on Dec 30, 2022 2:18 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ ఖుషి. 2001లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీని ఎస్ జె సూర్య తెరకెక్కించారు. ఇక 21 ఏళ్ళ తరువాత మరొక రెండు రోజుల్లో అనగా డిసెంబర్ 31న ఖుషి మూవీ రీరిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ జె సూర్య నేడు కొద్దిసేపటి క్రితం అప్పటి ఖుషి మూవీ అనుభవాలను, అలానే పవన్ కళ్యాణ్ తో తన వర్క్ ఎక్స్ పీరియన్స్ ని వీడియో బైట్ ద్వారా పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ఫస్ట్ టైం పవర్ స్టార్ తో వర్క్ చేసిన ఈ మూవీ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేనని, ముఖ్యంగా మూవీలో ఏ మేరా జహా హిందీ సాంగ్ పెట్టడంతో పాటు పలు సీన్స్ లో డైలాగ్స్ ని పరిశీలిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలో సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు తెలుస్తుందని, అటువంటి హీరోతో వర్క్ చేసిన ఖుషి మెమొరీస్ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. కాగా సూర్య ఖుషి మూవీ అనుభవాలు పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు