కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇండియన్ 2. యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జైంట్ మూవీస్ పతాకాల పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా లో ఎస్.జే. సూర్య నటిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో కమల్ హాసన్ ఇండియన్ 2 లో, రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో, విశాల్ మార్క్ ఆంటోనీ లో నటిస్తున్నారు అని అడగగా, సూపర్ అహ్ అంటూ సమాధానం ఇచ్చారు. ఇండియన్ 2 లో ఎస్. జే. సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ మరియు ఎస్.జే. సూర్య ల పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ కి ట్రీట్ ఖాయం అని తెలుస్తోంది. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.