“స్కంద” కల్ట్ జాతర ఈవెంట్ తో మరింత హైప్?

Published on Sep 24, 2023 11:49 pm IST


టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ రామ్ పోతినేని స్కంద సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే మరో ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రం కి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, టీమ్ రేపు కరీంనగర్‌లో భారీ ఈవెంట్‌ను నిర్వహించనుంది.

రేపు సాయంత్రం 6 గంటల నుంచి వి.కన్వెన్షన్‌లో స్కంద కల్ట్ జాతర పేరిట కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్ తో సినిమా పై మరింత హైప్ క్రియేట్ కానుంది. ఇప్పటికే ఉన్న బజ్ ప్రకారం, ఈ చిత్రం రామ్ పోతినేనికి అత్యధిక ఓపెనర్ అవుతుంది. సినిమా కంటెంట్‌పై ఆధారపడి లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, మేజర్ ఫేమ్ సాయి మంజ్రేకర్ కీలక పాత్రలో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :