థమన్ పవర్ఫుల్ బీట్స్ తో అదిరేలా “స్కంద” కల్ట్ మామ సాంగ్

Published on Sep 18, 2023 12:00 pm IST

మన టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా శ్రీలీల హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన భారీ చిత్రం “స్కంద” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనగా రామ్ సరికొత్త మేకోవర్ లో బోయపాటి మాస్ టేకింగ్ లో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి అయితే ఓ స్పెషల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా కల్ట్ మామ అని ఈ చవితి కానుకగా ప్లాన్ చేశారు. మరి ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ సాంగ్ అయితే మళ్ళీ పాత థమన్ ని గుర్తు చేసింది. కంప్లీట్ మాస్ అండ్ పవర్ ఫుల్ బీట్స్ తో రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా కొట్టేసాడు. అలానే మధ్యలో సాలిడ్ ఎలక్ట్రానిక్ స్కోర్ తో ఈ సాంగ్ మరింత బ్లాస్టింగ్ గా అనిపించింది.

మరి రామ్ తో పాటుగా సాంగ్ కోసం వచ్చిన బాస్ బ్యూటీ ఊర్వశి రౌటేలా కూడా అదరగొట్టింది అనే చెప్పాలి. మొత్తానికి అయితే స్కంద నుంచి ఓ సాలిడ్ బీట్ వచ్చింది అనే చెప్పాలి. మరి ఈ సినిమాకి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించగా ఈ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీస్ కాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :