ఈ చిత్రాల్లో హోప్ అంతా “స్కంద” మీదనే.!

Published on Sep 23, 2023 12:30 am IST

మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సాలిడ్ మాస్ డ్రామా “స్కంద” కోసం అందరికి తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి స్యూర్ షాట్ గా తీసుకొస్తున్న ఈ చిత్రం కోసం తెలుగు ఆడియెన్స్ బాగానే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సెప్టెంబర్ 28 రేస్ లో స్కంద తో పాటుగా చాలానే సినిమాలు కూడా ఉండగా ఈ అన్ని చిత్రాల్లో అయితే కాస్త ఎక్కువ బజ్ మాత్రం స్కంద పైనే ఉందని వినిపిస్తుంది.

ఇంకా దీనికి కూడా ఇంకా సరైన ప్రమోషన్స్ లేనప్పటికీ ఇప్పుడు ఉన్న రిలీజ్ అన్ని చిత్రాల్లో కన్నా స్కంద బెటర్ అని చాలా మంది అనుకుంటున్నారు. పైగా చాలా రోజులు నుంచి పెద్ద సినిమాలు కూడా లేవు దీనితో స్కంద పైనే అందరి చూపులు పడ్డాయి. మరి స్కంద అయితే ఈ గుడ్ టైం ని క్యాష్ చేసుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :