“సలార్” డేట్ ను ఫిక్స్ చేసుకున్న రామ్ “స్కంద”

Published on Sep 6, 2023 11:22 am IST


టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. ఈ చిత్రం ను సెప్టెంబర్ 15, 2023 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ లో నటించిన సలార్ వాయిదా పడటం తో స్కంద రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు.

స్కంద ఇప్పుడు సెప్టెంబర్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. సాయి మంజ్రేకర్, శ్రీ లీల నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :