‘స్కంద’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్

Published on Sep 21, 2023 9:00 pm IST

రామ్ పోతినేని హీరోగా శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

మాస్ పవర్ఫుల్ రోల్ లో రామ్ కనిపించనున్న ఈ మూవీలో గౌతమి, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, సాయి మంజ్రేకర్, ప్రభాకర్, శ్రీకాంత్, బబ్లు పృథ్వీరాజ్, శరత్ లోహితస్వ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది స్కంద. ఇక తాజాగా ఈ మూవీని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్న పలు ఏరియాల డిస్ట్రిబ్యూటర్ల్స్ లిస్ట్ ని మేకర్స్ ప్రకటించారు.

నైజాం – శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్
వైజాగ్ – సి ఫెల్లస్ కాన్సెప్టువల్ స్టూడియోస్ (అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ద్వారా)
సీడెడ్ – ఎస్ ఆర్ ఆర్ ఫిలిమ్స్
ఈస్ట్ – శ్రీ లాస్య ఫిలిమ్స్
వెస్ట్ – మహిక మూవీస్
కృష్ణ – జి 3
గుంటూరు – వి ఎంటర్టైన్మెంట్స్
నెల్లూరు – అంజలి పిక్చర్స్

సంబంధిత సమాచారం :