డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన సత్యదేవ్ “స్కై ల్యాబ్”

Published on Jan 11, 2022 12:41 pm IST


సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ లు ప్రధాన పాత్రల్లో పీరియడ్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన చిత్రం స్కై ల్యాబ్. బైట్ ఫీచర్స్ మరియు నిత్యా మీనన్ కంపనీ ల పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది.

ఈ చిత్రం జనవరి 14 వ తేదీ నుండి సోనీ లివ్ లో ప్రసారం కానుంది. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించడం జరిగింది. పృథ్వీ పిన్నమరాజు మరియు నిత్యా మీనన్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సోనీ లివ్ లో ఏ తరహాలో ఆకట్టుకుంటుందొ చూడాలి.

సంబంధిత సమాచారం :