రేపు విడుదల కానున్న సత్యదేవ్ “స్కై ల్యాబ్” ట్రైలర్!

Published on Nov 5, 2021 7:57 pm IST


విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నారు హీరో సత్యదేవ్. సత్యదేవ్ హీరోగా విశ్వక్ ఖండేరావు దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం స్కై ల్యాబ్. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ ప్రకటన తోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రం నుండి రిలీజ్ కానున్న ట్రైలర్ పై ఒక ప్రకటన వెలువడింది.

ఈ చిత్రం ట్రైలర్ ను రేపు ఉదయం విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రకటన విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం లో సత్యదేవ్ సరసన హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తుండగా, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ళ భరణి, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాక్టర్ కే. రవి కిరణ్ సమర్పణ లో వస్తున్న ఈ చిత్రాన్ని పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :