సోనీ లివ్ లో స్ట్రీమింగ్ వచ్చేసిన “స్కై ల్యాబ్”

Published on Jan 14, 2022 4:00 pm IST


నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం స్కై ల్యాబ్. డాక్టర్ కే. రవి కిరణ్ సమర్పణ లో బైట్ ఫీచర్స్ మరియు నిత్యా మీనన్ కంపనీ బ్యానర్ ల పై పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన ఈ చిత్రం కి విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సోనీ లివ్ లో ప్రస్తుతం స్కై ల్యాబ్ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారం అవుతుంది. గౌరీ పాత్రలో నిత్యా మీనన్, బండలింగం పల్లి వాసుల అందమైన ప్రయాణం ను చూసేందుకు సిద్ధం అయ్యారు ప్రేక్షకులు, అభిమానులు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :