క్యాష్‌లో “స్కైలాబ్”.. ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా లేదండోయ్..!

Published on Dec 2, 2021 2:00 am IST


యాంకర్ దిగ్గజం సుమ కనకాల హోస్ట్‌గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంకు ఎంతో మంది ప్రేక్షక అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో సుమ నలుగురు సెలబ్రెటీలతో కలిసి నవ్వుతూ, నవ్విస్తూ వారితో గేమ్ షోను పూర్తి చేయిస్తుంది. అయితే ఈ షోకు “స్కైలాబ్” మూవీ టీం వచ్చి సందడి చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యిందీ.

సత్యదేవ్‌, నిత్యమీనన్‌, విష్ణు, విశ్వక్‌లతో సుమ తనదైన శైలిలో గేమ్ ఆడిస్తూనే ఫుల్ టూ ఎంటర్‌టైన్‌ని జనరేట్ చేసింది. మరీ ఈ ఎపిసోడ్‌ను మిస్ కాకుండా చూడాలంటే మాత్రం ఈ శనివారం రాత్రి రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో వచ్చే క్యాష్ ప్రోగ్రామ్ తప్పక చూడాల్సిందే. ఇదిలా ఉంటే సత్యదేవ్‌, నిత్యమీనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “స్కైలాబ్‌”. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 4న విడుదలవుతోంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :