దుబాయ్ లో ‘స్నేహమేరా జీవితం’ ట్రైలర్ లాంచ్ !

9th, November 2017 - 11:37:20 AM

ఆర్య, శంభోశివ శంభో, చందమామ సినిమాలతో నటుడు శివ బాలాజీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా శివ బాలాజీ హీరోగా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘స్నేహ‌మేరా జీవితం’. ధన్ విన్ కాంగుల సమర్పణలో గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా కు మహేష్ ఉప్పుటూరి దర్శకుడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. 1980 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ. శివబాలాజీతో పాటు ప్రముఖ నటుడు రాజీవ్ క‌న‌కాల కీల‌క‌పాత్ర‌ పోషిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా సుష్మ యార్ల‌గ‌డ్డ హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. నవంబర్ 10న దుబాయ్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగబోతుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమాకు భరణి కె.ధరణ్ సినిమాటోగ్రఫీ అందించారు.