“ఆదిపురుష్” లో ప్రభాస్ లుక్ ని ఆ టైప్ లో ఎక్కువ ఆశించారా.!

Published on Oct 1, 2022 12:00 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఆల్రెడీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్”. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్ నుంచి అయితే ఫ్యాన్స్ ఎప్పుడు నుంచి అవైటెడ్ గా ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ ని అయితే మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు. అయితే ఇది ఖచ్చితంగా అంచనాలు అందుకునే విధంగానే అనిపించింది.

కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మేకర్స్ ఫ్యాన్స్ సహా అందరి అంచనాలు తప్పని ప్రూవ్ చేశారు. ఎందుకంటే మన అందరికి తెలిసిన రాముడు అంటే నీలి మేఘ శ్యాముడే.. రాముడు అంటే నీలి వర్ణంలో కనిపించే ఓ ప్రకాశవంతమైన దేహం. అలాంటిది ప్రభాస్ ని ఆ నీలి వర్ణంలో చూస్తే ఏ లెవెల్ లో ఉంటుందో అని చాలా మంది ఆశించారు. కానీ మేకర్స్ అయితే నార్మల్ గానే చూపించారు. మరి ఈ తరహాలో ఆశించిన వారికి అయితే ఇది ట్విస్ట్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :