“అఖండ” లో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఎన్నంటే!

Published on Aug 31, 2021 5:09 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం “అఖండ” అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య మాస్ అండ్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం భారీ అంచనాలను నెలకొల్పుకుంది. అయితే వీరి కాంబో అంటేనే అన్ లిమిటెడ్ యాక్షన్.. మరి అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని బోయపాటి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఏకంగా 8 అదిరే యాక్షన్ సీక్వెన్స్ లు ప్లాన్ చేశారట. మరి వీటిలో దేనికి అదే హైలైట్ గా ఉంటుందట. ముఖ్యంగా అఘోర వెర్షన్ లో ఫైట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. టైటిల్ రివీల్ టీజర్ లో సీక్వెన్స్ మరియు క్లైమాక్స్ లు ప్రధాన ఆకర్షణగా సినిమాలో నిలుస్తాయని కూడా టాక్.

మొత్తానికి మాత్రం మాస్ ఆడియెన్స్ కి అఖండ గట్టి ట్రీట్ ఇవ్వడం కన్ఫర్మ్ అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :