‘దసరా’ పై ధూమ్ ధామ్ రేంజ్ లో హైప్

Published on Mar 24, 2023 3:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ రస్టిక్ మాస్ ఎంటర్టైనర్ మూవీ దసరా. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించారు. సింగరేణి బొగ్గు గనుల్లో పని చేసే కార్మికుల జీవితంలో సాగే కొన్ని ఘటనల ఆధారంగా మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీగా దసరా తెరకెక్కింది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

మార్చి 30న పలు భాషల్లో ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. విషయం ఏమిటంటే, ప్రస్తుతం దసరా కి సంబందించి పలు భాషల ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొం టున్నారు నాచురల్ స్టార్ నాని, హీరోయిన్ కీర్తి సురేష్. అయితే ఈ సినిమాపై ఇప్పటికే యువత తో పాటు మాస్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. మరోవైపు ప్రమోషన్స్ కూడా అదిరిపోతుండడంతో దసరా హైప్ ధూమ్ ధామ్ అనే రేంజ్ లో పెరగగా తప్పకుండా అందరి అంచనాలు అందుకుని మూవీ మంచి సక్సెస్ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :