
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలో డైలాగులతో ప్రేక్షకులను ఎంతలా మంత్ర ముగ్దుల్ని చేస్తారో, అలానే తన టైటిల్స్ తో కూడా ఆకట్టుకుంటారు. టైటిల్స్ విషయంలో తన హీరో కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కథకి ఏది పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే అదే పెడతాడు. అలా వచ్చిన సినిమా పేర్లే జులాయి, అత్తారింటికి దారేది. ఇదే బాటలోనే త్రివిక్రమ్ తన తాజా సినిమాకి కూడా ‘S/O సత్యమూర్తి’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. అంతే కాకుండా ఈ సినిమాకి విలువలే ఆస్తి అనే ట్యాగ్ లైన్ ని కూడా పెట్టారు.
నిన్న ఈ టైటిల్ లోగో రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో అదే చర్చనీయాంశం అయ్యింది. అందరూ త్రివిక్రమ్ పెట్టిన విలువలే ఆస్తి అని పెట్టిన ట్యాగ్ లైన్ బాగుందని, ఈ ట్యాగ్ లైన్ చూస్తుంటే త్రివిక్రమ్ మరోసారి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మేజిక్ కి తెలుగు ప్రేక్షకులకు అందించానున్నాడని అంటున్నారు. అలాగే ఈ సినిమా కూడా అత్తారింటికి దారేది లానే ఎ,బి,సి అని సెంటర్స్ తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, స్నేహ, బ్రహ్మానందం, కృష్ణ చైతన్య, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.