
‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ప్రచార చిత్రాలు, ట్రైలర్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, విడుదలకు ముందే సంచనాలను నమోదు చేసింది. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.
ఇక తాజాగా నిన్న సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మార్క్ ఫైట్లు కూడా ఉన్నాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికేట్ జారీ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని తీసినందుకు గానూ నిర్మాతలను సెన్సార్ సభ్యులు అభినందించారట. ఈ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలూ మెండుగా ఉన్నాయని చిత్ర నిర్మాత రాధాకృష్ణ తెలిపారు. అభిమానులకు ఈ సినిమా పండగ లాంటిదని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ఆడియో ప్రేక్షకుల్లో మంచి హుషారును నింపింది. ఇక ట్రైలర్లో అల్లు అర్జున్ స్టైల్, త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులైతే ఈ కాంబినేషన్ మరొక హిట్ కొట్టినట్టే అని సంబరాల్లో మునిగిపోయారు. ఈ సినిమాను ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.