“ధృవ 2” ఎప్పటినుంచి మరి..?

Published on Mar 3, 2023 10:08 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లోని అదిరే ట్రాన్స్ఫర్మేషన్ ని చూపించిన సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా డెఫినెట్ గా “ధృవ” అని చెప్పాలి. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా నిలిచి మంచి కం బ్యాక్ గా మారింది. అయితే ఈ సినిమాకి ఒరిజినల్ “తని ఒరువన్” తమిళ్ లో ఆల్రెడీ ఉందని తెలిసిందే. దానిని తెరకెక్కించిన దర్శకుడు జయం మోహన్ రాజా ఆ మధ్య అయితే ఈ సినిమాకి పార్ట్ 2 అలాగే చరణ్ తో ధృవ 2 పై ఓపెన్ అయ్యారు.

అయితే తాను ఖచ్చితంగా తీస్తాను అని చెప్పారు. కానీ లేటెస్ట్ గా అయితే తమిళ్ లో హీరో జయం రవి తో పార్ట్ 2 ను ఈ ఏడాదిలో గాని వచ్చే ఏడాది లో గాని స్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసాడు. దీనితో అయితే చరణ్ సినిమాపై ఇప్పుడు సందేహం ఏర్పడింది. మరి ఒరిజినల్ గా తమిళ్ లో ముందు తీసి నెక్స్ట్ చరణ్ తో చేస్తారా లేక ఒకే సమయంలో కాస్ట్ మార్చి అయితే చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. మరి ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎలా షేప్ లోకి వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :