‘గాడ్‌ ఫాదర్‌’లో మెగాస్టార్ తో శోభన.. ?

Published on Sep 27, 2021 10:00 am IST

మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’లో మరో సీనియర్ హీరోయిన్ శోభన ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఆమె పాత్ర ఎమోషనల్ గా ఉంటుందట. దర్శకుడు మోహన్ రాజా, ఆమె క్యారెక్టర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. మలయాళ వెర్షన్ లో ‘మంజు వార్యర్’ పాత్రనే తెలుగు వెర్షన్ లో శోభన నటిస్తోందని టాక్ నడుస్తోంది.

ఇక ఈ సినిమాను మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని దర్శకడు మోహన్ రాజా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ వెరీ స్టైలిష్‌ గా ఉండబోతుంది. అందుకే ఈ చిత్రం పై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

కాగా ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర చాల కీలకంగా ఉంటుంది. ఆ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :