రాధే శ్యామ్ నుండి “సోచ్ లియా” సాంగ్ విడుదల!

Published on Dec 8, 2021 2:22 pm IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్దమైంది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని వరల్డ్ క్లాస్ ఫిల్మ్ గా తెరకెక్కించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో ప్రభాస్ లుక్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం నుండి తాజాగా సాచ్ లియా అనే పాట ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. మిథున్ సంగీతం అందిస్తున్న ఈ పాటను బాలీవుడ్ ఫేమస్ సింగర్ అయిన అరిజిత్ సింగ్ పాడటం జరిగింది. యూ వీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :