ప్రశంసలందుకుంటున్న ప్రకాష్ రాజ్ ‘మన ఊరి రామాయణం’

6th, October 2016 - 12:29:18 PM

mana-oori
నటుడు ప్రకాష్ రాజ్ దర్శకుడిగా మారి చేసిన మరో చిత్రం ‘మన ఊరి రామాయణం’ రేపు 7వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్బంగా మీడియా కోసం నిన్న సాయంత్రం సినిమా స్పెషల్ షోను ప్రదర్శించారు. సినిమా చూసిన విమర్శకులు పలువురు సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నటుడు ప్రకాష్ రాజ్ నటుడిగా, దర్శకుడిగా మంచి ప్రతిభ కనబరచాడని, సాధారణ మనుషుల్లో కనబడే భావోద్వేగాలను చాలా బాగా చూపాడని ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ముఖ్యంగా సినిమాలో కథనాన్ని ఎమోషనల్ గా నడపడంలో ఆయన సక్సెస్ అయ్యారని, ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి సినిమాల్లో ఇది కూడా ఒకటని పలువురు ప్రశంసిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలకానుంది. ఈ చిత్రాన్ని ‘ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్’ పై ప్రకాష్ రాజ్ స్వయంగా నిర్మించారు. ఇకపోతే ప్రియమణి, సత్యలు ఇందులో కీలక పాత్రల్లో నటించగా ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.