సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా షేక్.!

సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా షేక్.!

Published on Aug 9, 2022 7:08 AM IST


మామా తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఎవర్ గ్రీన్ ఛార్మింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెలకొల్పిన ఘనతలు రికార్డులు కోకొల్లలు ఎన్నో ఆశ్చర్యకర రికార్డులు కూడా సూపర్ స్టార్ సొంతం. ఇలా తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న మహేష్ తన ఇంపాక్ట్ ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ వరకు వెళ్ళింది.

మరి ఇంతటి పవర్ ఫుల్ పర్సనాలిటీ అయినటువంటి మహేష్ బర్త్ డే వస్తుంది అంటే హంగామా కూడా మామూలుగా ఉండదని తెలిసిందే కానీ ఈ ఏడాది బర్త్ డే మాత్రం మరింత సాలిడ్ అండ్ స్పెషల్ అని చెప్పాలి. టాలీవుడ్ లో ఏ హీరోకి కూడా సాధ్యం కాని విధంగా ఓ సినిమా స్పెషల్ షో కి సెన్సేషనల్ రెస్పాన్స్ తో స్టార్ట్ అయ్యిన ఈ బర్త్ డే నెవర్ బిఫోర్ గా మారింది.

దీనితో నిన్న సాయంత్రం నుంచి మహేష్ బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా షేక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అభిమానులు తో పాటుగా అనేకమంది సినీ ప్రముఖులు కూడా మహేష్ కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఎప్పుడో ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు హీరోగా ఒక స్పెషల్ గుర్తింపు తెచ్చుకొని రానున్న రోజుల్లో మహేష్ మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ మా 123తెలుగు యూనిట్ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.. హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు