సభ్య సమాజానికి మెసేజ్ ఇస్తానంటున్న బన్నీ !


‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కావడంతో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్, ఆడియో బ్రహ్మాండమైన హిట్ కావడంతో ఆ క్రేజ్ రెట్టింపైంది. అభిమానులంతా సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఆతురతగా ఉన్నారు. బన్నీ అండ్ టీమ్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా ఫ్యాన్సును సంతృప్తి పరచే విధంగా సినిమా ఉంటుందని చెబుతున్నారు.

తాజాగా జరిగిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడుతూ ‘మొదటిసారి బ్రాహ్మణ యువకుడి పాత్ర ట్రై చేశా. చాలా కష్టపడ్డాను. అందరికీ తప్పక నచ్చుతుంది. నాలో రెండు షేడ్స్ ఎందుకున్నాయి అనేదే సినిమా. మంచి యాక్షన్, కామెడీ కలగలిసిన కమర్షియల్ ఎంటర్టైనర్. అంతేకాక సినిమా ద్వారా సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాం’ అన్నారు. ఇకపోతే దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ శుక్రవారం 23న ప్రేక్షకుల ముందుకురానుంది.