“సాఫ్ట్‌వేర్ బ్లూస్” రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు క్రిష్..!

“సాఫ్ట్‌వేర్ బ్లూస్” రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు క్రిష్..!

Published on Jun 12, 2022 1:00 AM IST

శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. ఇటీవలే ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 24న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ “సాఫ్ట్ వేర్ బ్లూస్” అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు లక్షలలో శాలరీలు, అమ్మాయిలు పబ్బులు కాదు దూల తీరపోద్ధిరా.. రే.. అనే డైలాగ్ ఉన్న ట్రైలర్ చూస్తుంటే చాలా హిలెరియస్‌గా, ఎగ్జైటింగ్‌గా ఉంది. సాఫ్ట్‌వేర్‌లో జరిగే చిన్న చిన్న గమ్మత్తులు వారి జీవితాల గురించి చాలా చక్కగా తెరకెక్కించిన దర్శకుడు ఉమాశంకర్‌కు అల్ ద బెస్ట్. ఈ చిత్రంలో శ్రీరాం, భావనలు చాలా క్యూట్‌గా కనిపించినా చాలా చక్కగా నటించారు. కరోనా ప్యాండమిక్ దగ్గర నుండి ఇప్పటి వరకు అన్ని ప్రాబ్లెమ్స్ ను దాటుకొని ఈ నెల 24న థియేటర్లలో విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

దర్శకుడు ఉమాశంకర్ మాట్లాడుతూ ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను మంత్రి కేటీఆర్ గారు మరియు రిలీజ్ ట్రైలర్‌ను దర్శకుడు క్రిష్ గారు విడుదల చేసి సాఫ్ట్‌వేర్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన ఈ చిత్ర ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు.

సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ వి.కె రాజు మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ బ్యాక్ డ్రాప్‌లో “సాఫ్ట్‌వేర్ బ్లూస్” పేరుతో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటెర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి వస్తున్నా ఈ చిత్రాన్ని జూన్ 24న విడుదల చేస్తున్నామని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు