“బాలయ్య 108” లో ఊహించని అవతార్ లో ఫస్ట్ లుక్స్.!

Published on Mar 22, 2023 10:23 am IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా బాలయ్య కెరీర్ లో 108వ సినిమాగా తెరకెక్కుతూ ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ వీరసింహా రెడ్డి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తుండడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

పైగా బాలయ్య హ్యాట్రిక్ జైత్ర యాత్రని ఈ సినిమాతో కొనసాగించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఇదే ఊపులో అయితే మేకర్స్ ఈ ఉగాది కానుకగా బ్లాస్టింగ్ లాంటి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి ఈ పోస్టర్ లలో బాలయ్య ఊహించని అవతార్స్ లో అయితే కనిపిస్తున్నారని చెప్పాలి.

బాలయ్య హీరోగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనుండగా ఓ లుక్ అయితే వింటేజ్ బాలయ్యని తలపించేలా కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్స్ తో అంచనాలు ఒక్కసారిగా భారీ లెవెల్లోకి పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :