ఊహించని బ్యాక్ డ్రాప్ లో చరణ్, గౌతమ్ ల ప్రాజెక్ట్.?

Published on Oct 16, 2021 3:00 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ పైనే అంతా హాట్ టాపిక్ నడుస్తుంది. నిన్న దసరా కానుకగా రెండు భారీ సినిమాలు అనౌన్స్ చెయ్యడంతో ఒక్కసారిగా మళ్ళీ నేషనల్ లెవెల్లో చరణ్ పేరు రీసౌండ్ అవుతుంది. అయితే ఉదయం టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ప్లాన్ చేసిన భారీ ప్రాజెక్ట్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

ఇది వరకు మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలు తెరకెక్కించిన మెప్పించిన గౌతమ్ ఈసారి చరణ్ కోసం ఒక ఊహించని సాలిడ్ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసాడట. మరి బహుశా ఇది ఒక భారీ స్కై ఫై థ్రిల్లర్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇందులో ఇంకా ఎంతమేర నిజముందో కానీ పాన్ ఇండియన్ వైడ్ ఆడియెన్స్ ని టచ్ చెయ్యాలి అంటే ఈ తరహా యూనివర్సల్ కాన్సెప్ట్ ని చెయ్యాల్సిందే. మరి నిజంగానే ఈ కాంబోలో ఇలాంటి సినిమా ఉందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :