గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా ఆద్వానీ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మరి సాలిడ్ హైప్ ఉన్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ ఇక దగ్గరకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆల్రెడీ బయట దేశాల్లో ఈ చిత్రానికి బుకింగ్స్ స్టార్ట్ కాగా యూకే మార్కెట్ లో అయితే గేమ్ ఛేంజర్ సాలిడ్ స్టార్ట్ తో మొదలైనట్టుగా తెలుస్తుంది.
అక్కడ ఆల్రెడీ టికెట్ సేల్స్ లో జస్ట్ కొద్ది సేపట్లోనే 1500 ప్లస్ టికెట్స్ అమ్ముడుపోయి సాలిడ్ స్టార్ట్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో గేమ్ ఛేంజర్ సినిమాతో చరణ్ ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ లో అక్కడ మంచి నెంబర్ పెట్టడం ఖాయం అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించిన ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.