సాలిడ్ బిజినెస్ తో “భోళా శంకర్”.?

Published on Jun 6, 2023 11:34 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా మరో టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న చిత్రం “భోళా శంకర్” కోసం అందరికీ తెలిసిందే. మరి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సాంగ్ భోళా మేనియా మంచి హిట్ కాగా మెగాస్టార్ లాస్ట్ హిట్ సినిమా “వాల్తేరు వీరయ్య” సక్సెస్ ఈ రీమేక్ చిత్రానికి అయితే మంచి బూస్టప్ గా మారింది.

దీనితో ఈ సినిమాకి యూఎస్ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్ నే జరుపుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే సమయంలో ఇప్పుడు బోళా శంకర్ తెలుగు స్టేట్స్ బిజినెస్ పై కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి గాను తెలుగులో అయితే ఓవరాల్ ఈజీగా 70 నుంచి 80 కోట్ల మధ్యలో బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇందులో 40 కోట్లకుపైగానే ఏపీ నుంచి జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి భోళా బిజినెస్ పై మరింత డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :