మాస్ మహారాజ్ నెక్స్ట్ పై సాలిడ్ బజ్!

మాస్ మహారాజ్ నెక్స్ట్ పై సాలిడ్ బజ్!

Published on Feb 9, 2025 7:00 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రమే “మాస్ జాతర”. తన హిట్ హీరోయిన్ శ్రీలీలతో మరోసారి దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రం రిలీజ్ కోసం మాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫుల్ స్వింగ్ లో సినిమాలు కంప్లీట్ చేసే రవితేజ ఇపుడు తన లైనప్ లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది.

యంగ్ హీరోస్ తో మంచి సెన్సిబుల్ సినిమాలు అందించిన దర్శకుడు కిషోర్ తిరుమలకి ఇపుడు రవితేజ ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. నేను శైలజ, చిత్ర లహరి లాంటి సూపర్ హిట్స్ ఎన్నో ఇచ్చిన ఈ దర్శకుడు రవితేజ కోసం ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుని రెడీ చేయగా అది మాస్ మహారాజ్ ఓకే చేసేయడం కూడా జరిగింది అన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం ఈ వేసవి నుంచే సెట్స్ మీదకి కూడా వెళ్లనున్నట్టుగా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు