‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ రిలీజ్ అప్పుడేనా ?

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, మే 15, 2024న డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఈ టీజర్ విడుదల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

కాగా ఈ మూవీలో సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్‌ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మరి, డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Exit mobile version