“పుష్ప 2” లో రష్మిక రోల్ రూమర్స్ పై సాలిడ్ క్లారిటీ బయటకు.!

Published on Jun 22, 2022 11:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రైజ్” భారీ వసూళ్లతో అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవగా దీని తర్వాత చేయబోయే “పుష్ప ది రూల్” పై పార్ట్ 1 కన్నా డబుల్, ట్రిపుల్ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలో ఈ చిత్రంలో రష్మికా పాత్రపై గత కొన్ని రోజులు నుంచి ఓ టాక్ వైరల్ అవుతూ వస్తుంది.

ఈ సినిమాలో రష్మికా రోల్ ని విషాదంతో ముగించేస్తారని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ దీనిపై అయితే చిత్ర యూనిట్ నుంచి సాలిడ్ క్లారిటీ వినిపిస్తుంది. శ్రీవల్లి రోల్ కి ఎలాంటి విషాదాంతం ఉండదని అవన్నీ కేవలం తప్పుడు ప్రచారాలు మాత్రమే అని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :