ఇప్పుడు “అఖండ” ఓ ఎస్ టి రిలీజ్ పై నెలకొన్న సాలిడ్ క్రేజ్.!

Published on Jan 25, 2022 9:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన ఆస్థాన దర్శకునిగా మారిపోయిన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మాస్ శివ తాండవం “అఖండ”. అనేక అంశాలు ఈ సినిమాని ఓ రేంజ్ లో హైలైట్ గా నిలిపాయి. మరి వీటిలో సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన పాటలు కానీ తాను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఈ సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లాయి.

మొదటి ఆట చూసిన తర్వాత నుంచి కూడా అఖండ లో ఆ శివ తాండవంకి తగ్గట్టుగా థమన్ ఇచ్చిన ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కోసం మాట్లాడకుండా ఏ మూవీ లవర్ గాని ఆడియెన్ గాని లేడు. ఇక ఇప్పుడు మళ్ళీ సినిమా ఓటిటి లో వచ్చాక మరోసారి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్(ఓ ఎస్ టి) రిలీజ్ కోసం ఇప్పుడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు థమన్ చేసిన చాలా సినిమాల సౌండ్ ట్రాక్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు వాటి అన్నిటినీ మించి అఖండ సౌండ్ ట్రాక్ పై సాలిడ్ క్రేజ్ నెలకొంది. అయితే ఈ సినిమాలోని సెకండాఫ్ నుంచి వచ్చే స్కోర్ గాని మళ్ళీ క్లైమాక్స్ టైటిల్స్ లో వచ్చే సాంగ్ వేరే లెవెల్లో ఉంటాయి. వాటి కోసం ఇప్పుడు ఆడియెన్స్ క్రేజీగా ఎదురు చూస్తున్నారు. మరి థమన్ ఎప్పుడు అఖండ ఓ ఎస్ టి ని రిలీజ్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :