“సర్కారు వారి పాట” ఫస్ట్ సింగిల్ పై సాలిడ్ క్రేజ్.!

Published on Jan 28, 2022 7:02 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి మేకర్స్ అంతే మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని రీసెంట్ గానే అనౌన్స్ చేయడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట అంతా ఒక మాస్ నెంబర్ ని రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ స్పెషల్ సాంగ్ అందులోని సినిమా ఫస్ట్ సాంగ్ ఇదే కావడంతో దీనికి సాలీడ్ రికార్డ్స్ సెట్ చేసి పెట్టాలని మహేష్ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యిపోయారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ ని టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు నుంచే సాలిడ్ క్రేజ్ తో వాటి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇక ఈ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :