“ఎఫ్ 3” ఓటిటి స్ట్రీమింగ్ కి సాలిడ్ డీల్..?

Published on Jul 3, 2022 10:04 am IST


రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన మరో క్రేజీ మల్టీ స్టారర్ అందులోని హిట్ చిత్రం “ఎఫ్ 3”. విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం తమ గత హిట్ ఫ్రాంచైజ్ ఎఫ్ 2 కి సీక్వెల్ గా వచ్చింది. మరి ఈ సినిమా కూడా అన్ని అంచనాలు అందుకొని థియేటర్స్ లో హిట్ కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది.

అయితే ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజు టికెట్ రేట్స్ మరియు స్ట్రీమింగ్ డేట్స్ పరంగా కొత్త ట్రెండ్ ని స్టార్ట్ చేశారు. 8 వారాల తర్వాతే ఈ సినిమా స్ట్రీమింగ్ కి వస్తుంది అని తెలిపారు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని అంతకన్నా ముందే స్ట్రీమింగ్ కి సోనీ లివ్ లో తీసుకొస్తున్నట్టుగా అయితే ఈ ఎర్లీ స్ట్రీమింగ్ కి గాను 13 కోట్లు చెల్లించినట్టు తెలుస్తుంది. ఇది మాత్రం సాలిడ్ డీల్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించారు.

సంబంధిత సమాచారం :