“ఆదిపురుష్” కి పెరుగుతున్న డిమాండ్.!

Published on May 6, 2023 8:14 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే భారీ హైప్ ఉన్న ఈ చిత్రాన్ని అయితే ఈ జూన్ కి రిలీజ్ కి సిద్ధం చేస్తుండగా మేకర్స్ ఇప్పుడు సాలిడ్ ప్రమోషన్స్ ని చేస్తున్నారు. మరి ఇప్పుడు అంతా ఎంతో ఆసక్తిగా ట్రైలర్ కోసం ఎదురు చూస్తుండగా ఇప్పుడు సినిమాకి అయితే ఇండియా వైడ్ గా మంచి డిమాండ్ నెలకొంటున్నట్టుగా తెలుస్తుంది.

సౌత్ సహా నార్త్ లో కూడా మంచి బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో అయితే ఈ చిత్రానికి ఏ రీతిలో నెగిటివిటీ నెలకొందో దానిని మించి ఇప్పుడు ఇలాంటి భారీ డిమాండ్ నెలకొనడం అనేది ప్రభాస్ కే చెల్లింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజయ్ అతుల్ లు సంగీతం అందించగా ఈ జూన్ 16న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :