“తునివు” ఫస్ట్ సింగిల్ పై గట్టి అంచనాలు.!

“తునివు” ఫస్ట్ సింగిల్ పై గట్టి అంచనాలు.!

Published on Dec 8, 2022 7:02 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “తునివు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు అయితే ఈ సినిమాపై నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ అవైటెడ్ సినిమా నుంచి సౌత్ లో అయితే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి.

సెన్సేషనల్ మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ తో ప్లాన్ చేసిన ఈ సాంగ్ “చిల్లా చిల్లా” అనే టైటిల్ తో వస్తుండగా ఈ సాంగ్ కి ఫైనల్ గా డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ డిసెంబర్ 9న ఈ సాంగ్ మొదట తమిళ్ లో రిలీజ్ కానుండగా ఈ సినిమా సంగీత దర్శకుడు జిబ్రాన్ కూడా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఈ సాంగ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రం అయితే ఈ జనవరి లో రిలీజ్ కానుండగా బోనీ కపూర్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు