భారీ ఫిగర్ కి “పుష్ప 1” స్ట్రీమింగ్ హక్కులు.!

Published on Jan 6, 2022 10:00 pm IST


లేటెస్ట్ ఇండియన్ సినిమా బ్లాక్ బస్టర్స్ లో ఒకటి “పుష్ప ది రైజ్”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ల కాంబో లో వచ్చిన ఈ హ్యాట్రిక్ సినిమా ఆ కాంబో పై ఉన్న అంచనాలు అన్నీ రీచ్ అయ్యి సాలిడ్ రన్ ని కనబరిచింది. మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యి ఈ కొన్ని రోజులకే దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా షాక్ ఇచ్చింది.

అయితే థియేటర్స్ లో ఎంత క్రేజ్ తో ఎదురు చూసారో వారంతా మళ్ళీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎంత ధర పెట్టి కొనుగోలు చేసారో అనేది తెలుస్తుంది. మరి ఈ సినిమాకి గాను మొత్తం 22 కోట్లు భారీ ఫిగర్ పలికినట్టుగా లేటెస్ట్ టాక్. అలానే ఇటీవల వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఇంకో ఆధిక్యం అని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పుష్ప ఖాతాలో మరో లాభం వచ్చిపడింది..

సంబంధిత సమాచారం :