“భీమ్లా నాయక్” ట్రైలర్ పై పెరుగుతున్న హైప్.!

Published on Feb 19, 2022 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలు గా నటించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ కి ఇప్పుడు సిద్ధంగా ఉంది. మరి రీసెంట్ గానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై నెలకొన్న హైప్ అయితే ఇప్పుడు అంతా ఇంతా కాదు.

ఇక టైం కూడా దగ్గర పడుతుండడంతో అంతా ఈ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ పై అప్డేట్ బహుశా ఈరోజు రావచ్చని గట్టి టాక్ అయితే వినిపిస్తుంది. మరి అలాగే ఈ ట్రైలర్ వచ్చాక సినిమాపై మరిన్ని భారీ అంచనాలు నెలకొనడం గ్యారెంటీ అని తెలుస్తుంది. మరి చూడాలి మేకర్స్ ట్రైలర్ ని ముందే రిలీజ్ చేస్తారా లేక ప్రీ రిలీజ్ ఫంక్షన్ నాడు రిలీజ్ చేస్తారా అనేది.

సంబంధిత సమాచారం :