ఈ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమాపై ఓ రేంజ్ లో పెరుగుతున్న హైప్.!

Published on Jun 22, 2022 7:04 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి భారీ మాస్ క్రౌడ్ పుల్లర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు భారీ స్థాయి అంచనాలతో తన కెరీర్ లో 30వ సినిమాని దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై సాలిడ్ హైప్ నెలకొనగా దాని తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడు.

దీనిపై కూడా ఎనలేని హైప్ నెలకొనగా రీసెంట్ గా తమిళ్ కి చెందిన సాలిడ్ ఫిల్మ్ మేకర్ వెట్రిమారన్ తో సినిమా టాక్ బయటకి రాగ దీనిపై ఇప్పటికీ బజ్ కొనసాగుతుంది. లేటెస్ట్ గా అయితే ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా ఉందనే ప్రచారం జరుగుతుంది కానీ ఎంతవరకు నిజమో ఎవరికీ తెలీదు కాకపోతే ఈ క్రేజీ కాంబోపై హైప్ అంతకంతకు పెరుగుతుంది. మరి వేచి చూడాలి, నిజంగానే ఈ కాంబోలో సినిమా వస్తుందో లేదో అనేది.

సంబంధిత సమాచారం :