‘పెద్ది’ షూట్ పై సాలిడ్ అప్డేట్.. ఈ స్పోర్ట్ షూట్ లో బిజీ!

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “పెద్ది”(Peddi). సాలిడ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కేవలం క్రికెట్ ఒక్క దానిపైనే కాకుండా అనేక క్రీడల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో మరో స్పోర్ట్ కి సంబంధించిన షూట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. బుచ్చిబాబు అండ్ కో ఇప్పుడు కుస్తీ పోటీలపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సన్నివేశాలు అన్నీ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్టింగ్స్ లో చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సీన్స్ లో రామ్ చరణ్ లేకుండానే సాగుతున్నట్టు టాక్. సో మొత్తానికి మాత్రం పెద్ది ఫుల్ స్వింగ్ లో సాగుతుంది అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యెందు శర్మ తదితరులు నటిస్తుండగా ఈ ఏప్రిల్ 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version