“హిట్ 2” కి సాలిడ్ నంబర్స్.!

Published on Dec 1, 2022 3:02 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2”. తన ఫ్రాంచైజ్ లో రెండో సినిమాగా చేసిన ఈ ప్రాజెక్ట్ రేపు డిసెంబర్ 2 నుంచి వరల్డ్ థియేటర్స్ స్క్రీన్స్ ను హిట్ చేయనుంది. అయితే ఈ సినిమాకి ఆల్రెడీ సాలిడ్ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. మరి దీనితో అయితే ఈ చిత్రం ఓవర్సీస్ లో మంచి బుకింగ్స్ ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది.

కేవలం ప్రీమియర్స్ తో ఆల్రెడీ లక్ష డాలర్స్ దాటేసిన ఈ చిత్రం డెఫినెట్ గా 2 లక్షల డాలర్స్ మార్క్ ని ఈ చిత్రం అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ లో కూడా గట్టి టాక్ నడుస్తుంది. మరి ఈ దీనిపై అసలు నెంబర్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం శ్రీలేఖ మరియు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమా వారు నిర్మాణం వహించారు. అలాగే నాచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :