హిందీలో చిరు “గాడ్ ఫాథర్” ఈ హక్కులకు కి సాలిడ్ ఆఫర్?

Published on Jun 19, 2022 10:00 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ సల్మాన్ ఖాన్ లు నటిస్తున్న భారీ చిత్రం “గాడ్ ఫాథర్” కూడా ఒకటి. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా రీసెంట్ గా మెగాస్టార్ కూడా ఈ సినిమా రిలీజ్ పై ఓ క్రేజీ అప్డేట్ అందించడం ఆసక్తిగా మారింది.

అయితే ఈ చిత్రంపై ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాక్ కూడా వినిపిస్తుంది. ఈ సినిమాకి గాను హిందీలో డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కి సాలిడ్ అఫర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ బజ్ ప్రకారం అయితే ఈ చిత్రానికి 42 నుంచి 45 కోట్ల మధ్యలో డీల్ ఓ ప్రముఖ సంస్థతో లాక్ అయ్యినట్టుగా టాక్. మరి ఆ సంస్థలు ఏంటి అనే వాటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :