“లైగర్” ఆడియో రైట్స్ కి భారీ డీల్ ఇచ్చిన టాప్ సంస్థ.!

Published on May 3, 2022 1:00 pm IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “లైగర్”. పూరి జగన్నాథ్ హిట్ బ్యాక్ డ్రాప్ బాక్సింగ్ నేపథ్యంలో వాటికి మించి భారీ హంగులతో తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. మరి పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసిన ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ చిత్రం తాలూకా అండీ హక్కులని ప్రముఖ టాప్ ఆడియో సంస్థ అయినటువంటి సోనీ మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారట. మరి ఈ సినిమాకి గాను వారు ఏకంగా 14 కోట్లు చెల్లించి అన్ని భాషల హక్కులు కొనుగోలు చేశారట. మరి విజయ్ కెరీర్ లో ఇదే అత్యధికం అని చెప్పాలి. అయితే ఈ సినిమాకి సంగీతం అందిస్తుంది ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25న రిలీజ్ చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :